యాప్నగరం

వివేకానంద రెడ్డి హత్య కేసు: కేరళ వ్యక్తి సాయం కోరిన సునీత.. సీబీఐకి తోడుగా రంగంలోకి?

ఏపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు విషయమై ఆయన కుమార్తె సునీత ఇటీవల కేరళ హక్కుల కార్యకర్త సాయం కోరారు.

Samayam Telugu 16 Jan 2021, 8:28 am
వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకూ నిందితులెవరో తేలలేదు. హత్య జరిగి రెండేళ్లు కావొస్తున్నా.. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. సిట్ దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోవడంతో.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వివేకానంద కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడం ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం తెలిసిందే. సీబీఐ విచారణ చేపడుతున్నప్పటికీ.. నిందితులెవరో ఇంకా తేలలేదు.
Samayam Telugu ys sunitha | Image: Twitter


ఇలాంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి కూతురు సునీత.. కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన తండ్రి హత్య కేసులో జోమున సాయాన్ని సునీత కోరినట్లు తెలుస్తోంది. 2019 మార్చి 15న వివేకానంద పులివెందులలోని తన ఇంట్లోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే.
Read Also: జగన్ గారూ ఒక్క ఛాన్స్ దీనికేనా..? పండుగ పూట పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎంపీ

సిస్టర్ అభయ హత్య కేసులో జోమున్ తీవ్రంగా పోరాడారు. అభయది ఆత్మహత్యేనని పోలీసులు కేసును మూసివేయించగా.. ప్రజలతో కలిసి ఉద్యమించిన జోమున్.. సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ క్రమంలో ఆయనపై హత్యాయత్నం సైతం జరిగింది.

Must Read: బెస్ట్ సీఎంల జాబితా: టాప్‌లో జగన్.. మరి కేసీఆర్?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.