యాప్నగరం

‘కంటి వెలుగు’ ఇప్పటికే ఉంది.. జగన్ గారూ పేరు మార్చి బిల్డప్ ఇవ్వొద్దు: లోకేశ్

ఏపీ సర్కారు అక్టోబర్ 10న కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి e-ఐ కేంద్రాల పేరిట ఈ పథకాన్నిప్రారంభించారని లోకేశ్ తెలిపారు. పేరు మార్చి జగన్ డబ్బా కొట్టొద్దని ఆయన ఎద్దేవా చేశారు.

Samayam Telugu 3 Sep 2019, 7:20 pm
ప్రజా సంక్షేమంపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కారు.. అక్టోబర్ 10న ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ప్రారంభించిన కంటి వెలుగు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏపీలోనూ అమలు చేయబోతున్నారు. అయితే ఏపీ సర్కారు ప్రారంభించబోతున్న కార్యక్రమంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Samayam Telugu nara lokesh2


చంద్రబాబు హయాంలో ‘‘ముఖ్యమంత్రి e-ఐ కేంద్రాలు’’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించామని.. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా సేవలు పొందారని లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘‘ఈ విషయం స్వయంగా జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న 'ఆరోగ్య ఆంధ్ర'నే చెప్తోంది. ఆ పథకాన్నే పేరు మార్చి, కొత్త పథకం అంటూ జగన్ గారి ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. కొత్త నిర్ణయం అంటూ ప్రజలను మభ్య పెడుతోంది. జగన్ గారూ! ఇప్పటికే ఉన్న పథకాలపై బిల్డప్ ఇవ్వకుండా, తమరి నవరత్నాల సంగతి చూడండి’’ అని లోకేశ్ ట్వీట్లు వదిలారు.

‘ముఖ్యమంత్రి e-ఐ కేంద్రాల’ను 2018 ఫిబ్రవరి 1న నాటి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించారు. https://eeyekendram.phc.ind.in పేరిట ప్రస్తుతం ఓ వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది. దానిపై సీఎం జగన్ ఫొటో కూడా ఉంది.

Read Also: ‘జగన్ అంత నీచంగా వైఎస్ కూడా వ్యవహరించలేదు’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.