యాప్నగరం

TDP నేతల నోరు మూయించేలా జగన్ నిర్ణయం, గతానికి భిన్నంగా పెన్షన్ల అందజేత!

అధికారంలోకి వచ్చాక ఫించన్ల పెంపు ఫైలుపై జగన్ తొలి సంతకం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల తొలి రెండు నెలలు ఫించన్లను సకాలంలో అందజేయలేకపోయారు. ఇక నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్లను అందజేయనున్నారు.

Samayam Telugu 30 Aug 2019, 8:55 am
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఫించన్ల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రూ.2000 ఇస్తోన్న పెన్షన్‌ను రూ.2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ పోతామని జగన్ తెలిపారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండు నెలల్లో పెన్షన్ల విడుదలలో కాస్త జాప్యం తలెత్తింది. ఫించన్లకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా పేరు మార్చిన జగన్ సర్కారు.. జూలైలో రాజశేఖరెడ్డి జయంతి రోజున అంటే జూలై 8న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఆ రోజే లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందాయి.
Samayam Telugu ys jagan26


టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఒకటో తేదిన లబ్ధి దారులకు అందేవి. జగన్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విడుదల ఆలస్యం కావడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. తమ హయాంలో పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు, వీఆర్వోలు ఒకటో తేదిన పెన్షన్లు అందించేవారని, ఇప్పుడు వారం గడిచినా పెన్షన్లు అందడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు.

Read Also: క్రిస్టియన్లకు జగన్ సర్కారు గుడ్ న్యూస్

ఈ విమర్శలకు సీఎం వైఎస్ జగన్ సరైన సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి నేరుగా లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పెన్షన్లు అందనున్నాయి. ఇక నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తారు. సెప్టెంబర్లో పెన్షన్ల విడుదల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 1280 కోట్లను విడుదల చేసింది. ఫించన్లను అందజేసే కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు, వీఆర్వోలు కూడా పాల్గొంటారు.

Read Also: బాబు తెచ్చిన పథకాన్ని రద్దు చేయనున్న జగన్?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.