యాప్నగరం

సీఎం జగన్ బర్త్ డే కోసం డబ్బు వసూలు: ఇదేం ఘోరం బాబోయ్.. ఎంపీ రఘురామ సంచలనం

YS Jagan: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సీఎం జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 19 Dec 2020, 9:46 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల కోసం వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం కొందరు వైసీపీ నేతలు వ్యాపారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారులన నుంచి వసూలు చేసే ఈ జే టాక్స్‌ను ఆపాలని వ్యాఖ్యానించారు.
Samayam Telugu సీఎం జగన్, రఘురామ


కరోనా సమయంలో వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దుష్టశక్తుల నుంచి వ్యాపారులను కాపాడండి అని ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపీ రఘురామ కోరారు. మీ పుట్టిన రోజు వేడుకల కోసం సొంత డబ్బు గానీ ప్రభుత్వ డబ్బు కానీ వాడండి వ్యాపారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న దుష్ట శక్తుల వల్ల పార్టీ పరువు, మీ పరువు పోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు.

జగన్ బర్త్ డే కోసం చేస్తున్న వసూళ్ల వల్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రఘురామ అన్నారు. చిరు వ్యాపారులను పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని చెప్పారు. అభిమానుల ఉన్మాద చర్యలపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. చిరు వ్యాపారుల పండ్ల వ్యాపారాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి పుట్టిన రోజు వేడుకల పేరుతో నేతల చేసున్న డబ్బులు వసూలు కార్యక్రమం ఆపండి అని రఘురామ కృష్ణరాజు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.