యాప్నగరం

వారికి రూ. 1,330 కోట్లు పంపిణీ.. జగన్ సర్కార్ చేయూత

YS Jaganmohan Reddy: రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్లు బియ్యం కార్డుదారులకు రూ. 1,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంకా పంపిణీ కొనసాగుతోంది.

Samayam Telugu 4 Apr 2020, 4:24 pm
కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలకు వైసీపీ ప్రభుత్వం చేయూతనందించింది. రాష్ట్రంలోని 1.33 కోట్ల బియ్యం కార్డుదారులకు రూ. 1,330 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రతి కార్డుదారుకు రూ.1,000 అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu 2


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.

కాగా, శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి బియ్యం కార్డుదారులకు వలంటీర్లు వెయ్యి రూపాయలు పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32,00,114 మంది బియ్యం కార్డు దారులకు రూ.320,01,14,000 వలంటీర్లు పంపిణీ చేశారు. కాగా, రాష్ట్రంలో ఇంకా వలంటీర్లు ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.