యాప్నగరం

YS Jagan సర్కార్ గుడ్ న్యూస్.. వారికి ఆ సర్టిఫికెట్ లేకుండానే రూ. 75 వేలు..

ముస్లిం మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

Samayam Telugu 30 Jun 2020, 8:57 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్సార్ చేయూత’ పథకానికి దరఖాస్తు చేసుకునే ముస్లిం, మైనారిటీ వర్గాల మహిళలకు కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 45-60 ఏళ్ల వయసు ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, మైనారిటీ సామాజిక వర్గాల మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ పథకం ద్వారా ప్రభుత్వం నాలుగేళ్లలో దశల వారీగా రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.
Samayam Telugu వైఎస్ జగన్ 4


Also Read: ‘పల్లె వెలుగు’ బస్సులకూ ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. ఏపీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం..

‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో లబ్ధి చేకూరని వారికి ‘చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. అయితే ‘వైఎస్సార్ చేయూత’ పథకం నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సాయం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బీసీ-బీ (దూదేకుల), బీసీ-ఈ ముస్లింలకు మాత్రమే కుల ధృవీకరణ పత్రం లభిస్తుంది.

Also Read: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు జగన్ సర్కార్ దిమ్మతిరిగేలా షాక్..

ఇతర మైనార్టీ వర్గాలకు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల వారు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయా సామాజిక వర్గాల వర్గాల వారికి ధ్రువీకరణ పత్రాల నుంచి మినహాయింపునిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ వివిధ సంక్షేమ పథకాల అమలులో అనుసరించే నిబంధనలు, విధివిధానాల మేరకు వైఎస్సార్ చేయూత పథకంలోనూ వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read: వైసీపీ ఎంపీ రఘురామ తేడా.. అందుకే మోదీ భజన.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.