యాప్నగరం

విజయవాడలో ‘దేవినేని’ నిత్య అన్నదానం.. వారికి మాత్రమే!

ప్రస్తుత లాక్ డౌన్ సంక్షోభంలో పేదలను ఆదుకునేందుకు వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ పేదల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Samayam Telugu 30 Mar 2020, 10:47 pm
సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే దివంగత మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్.. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దినసరి కూలీలు, యాచకులు, అనాథలు, స్వస్థలాలకు వెళ్లలేక చిక్కుకున్న విద్యార్థులు, నిరుపేదలకు నిత్య అన్నదానం చేయాలని సంకల్పించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో పనుల్లేక, ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వీరందరినీ ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు దేవినేని అవినాష్ వెల్లడించారు.
Samayam Telugu annadanam

విజయవాడ నగర పరిధిలో ప్రజలెవరైనా కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా భోజనానికి ఇబ్బందులు పడుతుంటే 9849186233 (రవీంద్ర), 9701111545 (చైతన్య) నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. భోజనం కావాల్సిన వారు ఉదయం 10గంటలు లోపు సమాచారం అందించాలని కోరారు.

ఎవరికైనా భోజనం కావాలని కాల్ చేస్తే మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? అనే వివరాలు అందజేయాలని దేవినేని అవినాష్ కోరారు. అలాగే దయచేసి ఆకతాయిలు ఎవరూ రాంగ్ కాల్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పేదలు, దీనుల ఆకలి తీర్చాలని మొదలుపెట్టిన సేవా కార్యక్రమంపై ఎవరూ ఆకతాయితనంతో వ్యవహరించవద్దని కోరారు. ఈ అన్నదానం అర్హులైన వారికి అందేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.