యాప్నగరం

ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

నామినేషన్‌కు గురువారమే ఆఖరి రోజు కావడం.. టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఏకగ్రీవమైంది. ఆయన రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీటుకు మళ్లీ ఆయనకే కేటాయించగా.. మళ్లీ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Samayam Telugu 25 Jun 2020, 4:37 pm
ఏపీ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటుకు నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నామినేషన్‌కు గురువారమే ఆఖరి రోజు కావడం.. టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఏకగ్రీవమైంది.
Samayam Telugu డొక్కా మాణిక్య వరప్రసాద్


డొక్కా మాణిక్యవరప్రసాదరావు ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. తర్వాత జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామి అవుతాను అన్నారు. అయితే ఆయన రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీటుకు మళ్లీ ఆయనకే కేటాయించగా.. మళ్లీ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డొక్కా కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. మాణిక్యవరప్రసాదరావును మాజీ ఎంపీ రాయపాటి టీడీపీలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ పదవితో పాటూ విప్ బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.. కానీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన ఉన్నట్టుండి పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.