యాప్నగరం

బాలయ్యకు తీసిపోని ప్రత్యర్థి ఇక్బాల్.. వైసీపీ కార్యకర్తపై దాడి

ఎమ్మెల్సీ ఇక్బాల్ తనపై దాడి చేశారని ఆరోపించిన వైఎస్సార్‌సీపీ నేత హనుమంత రెడ్డి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. హిందూపురంలో ఘటన

Samayam Telugu 29 Feb 2020, 11:00 am
హిందూపురం వైఎస్సార్‌సీపీలో కొత్త పంచాయితీ మొదలైంది. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై పోటీ చేసి ఓడిన ఇక్బాల్‌ సొంత పార్టీ కార్యకర్తపై దాడి చేశారట. ఎమ్మెల్సీ తనను కొట్టారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి చెబుతున్నారు. తన గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని.. తనకు గాయాలైనట్లు చెప్పుకొచ్చారు.
Samayam Telugu iqbal


ఏపీ ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి పనులకు సంబంధించి ఓ గ్రామంలో స్థానికంగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. వేరే వ్యక్తులు వచ్చి పనులు మొదలు పెట్టారట. తమకు సమచారం లేకపోవడంతో.. వెంటనే హనుమంత రెడ్డి హిందూపురం నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను కలిసేందుకు పార్టీ ఆఫీస్‌కు వెళ్లారట.

ఈ పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడదామనుకునే లోపే.. హనుమంత రెడ్డిని చూసిన ఇక్బాల్.. తన మొహంపై దాడి చేశారని బాధితుడు చెబుతున్నారు. తనలాంటి వ్యక్తులు పార్టీకి అవసరం లేదంటూ కోపగించుకున్నారని చెప్పుకొచ్చారు. తనపై దాడి అంశాన్ని పార్టీ అధిష్టానినికి ఫిర్యాదు చేస్తానని హనుమంత రెడ్డి చెబుతున్నారు. ఈ గొడవపై ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పందించాల్సి ఉంది.
ఇక్బాల్ 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్యపై పోటీచేసి ఓడిపోయారు. తర్వాత సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. నియోజకవర్గంలోనే ఉంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.