యాప్నగరం

‘చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు.. బాలయ్య అల్లుడికి భూ నజరానా’

బాలయ్య అల్లుడికి భూములు అప్పనంగా కట్టబెట్టారంటూ నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కుమ్మక్కై ఎకరం కేవలం లక్ష రూపాయల చొప్పున కేటాయించారని ఆరోపించారు.

Samayam Telugu 28 Aug 2019, 2:26 pm
రాజధాని అమరావతి తరలిపోతోందంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం రైతుల భూములు లాక్కుందని ఆరోపించారు. ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని దొనకొండకు తరలిస్తున్నారని ఎవరు చెప్పారని.. సీఎం వైఎస్ జగన్ చెప్పారా? అంటూ ప్రశ్నించారు.
Samayam Telugu pjimage (12)


Also Read : ఆ వ్యవహారం నా పెళ్లికి ముందు జరిగింది.. బొత్స వ్యాఖ్యలకు బాలయ్య చిన్నల్లుడు కౌంటర్

దొనకొండలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతోందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ట్రేడింగ్ చేసేది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేషేనని.. అలానే రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. విశ్వరాజధాని నిర్మిస్తామని చెప్పినా రాజధాని ప్రాంత ప్రజలు నమ్మలేదని, అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్‌ను చిత్తుగా ఓడించడం నిజం కాదా అని ప్రశ్నించారు.

Also Read :Botsa Satyanarayanaకు జగన్ క్లాస్.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

బాలయ్య అల్లుడి భూముల వ్యవహారంలోనూ లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డి కుమ్మక్కై పాలన సాగించారని.. అదే సమయంలో బాలకృష్ణ అల్లుడికి భూమి కేటాయించారన్నారు. ఎకరం కేవలం లక్ష రూపాయల చొప్పున భూములు కేటాదయించారని, కేవలం లక్షకే భూములు ఎలా కేటాయించారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నిదంచారు.


టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని లక్ష్మీపార్వతి విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు ప్రభుత్వం యువకులను మోసం చేసిందని, ఎన్నికలకు కొద్ది నెలల ముందు భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. జగన్ వారందరికీ గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.