యాప్నగరం

కోడెల మరణంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి. చంద్రబాబుతో పాటూ కుమారుడు, కూతురు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న లక్ష్మీ పార్వతి.

Samayam Telugu 28 Sep 2019, 10:19 pm
కోడెల బతికి ఉన్న సమయంలో కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వని చంద్రబాబు.. చనిపోయిన తర్వాత శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారన్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీపార్వతి. కోడెల మృతదేహంతో చంద్రబాబు శవ రాజకీయం చేశారని.. చంద్రబాబు, కుటుంబ సభ్యలు వలనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారని.. అలాంటి కొడుకు, కూతురు మరెవరికి ఉండకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu lakshmi


Read Also: 'ఆపరేషన్ వశిష్ట': బోటు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి శివ

కొడుకుపై ప్రేమ చూపించేవాళ్లు ఎలా నష్టపోతారో మహాభారతంలో దృతరాష్ట్రుడు ఉదాహరణనని.. ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఓ ఉదాహరణ అన్నారు. శివప్రసాదరావు స్వతహాగా మంచివాడైనా కొడుకు కూతురు వల్లే నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఇటు కోడెలపైనా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివప్రసాదరావు స్పీకర్ పదవికి మచ్చ తెచ్చారని.. ఆయన కొన్ని తప్పులు చేశారన్నారు. ఆయన కుటుంబం కూడా ఏ తప్పు చేయలేదా అంటూ ప్రశ్నించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు.. ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు వైఎస్సార్‌సీపీ నేత. రాజధాని, పోలవరం, పీపీఏలలో భారీగా అవినీతి చేశారని.. దోపిడీ చేసిన బాబుకు జగన్‌ పాలనను విమర్శించే హక్కు లేదన్నారు. టీడీపీ పాలనలో ప్రజా ధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని.. ఐదేళ్లలో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ట్విట్టర్‌లో మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్‌ తన తండ్రి దివంగవత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నారని లక్ష్మీ పార్వతి ప్రశంసించారు. తండ్రి బాటలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని.. అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్‌ నిజాయతీ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.