యాప్నగరం

గోదావరి బోటు ప్రమాదం: మాజీల మధ్య ముదురుతున్న మాటల యుద్దం

రాజకీయ నిరుద్యోగులు విషాద సంఘటనను ప్రచారానికి వాడుకోవాలనుకోవడం విచారకరం. రెండుసార్లు ఎంపీగా గెలిచిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 21 Sep 2019, 2:30 pm
Samayam Telugu pjimage (66)
గోదావరి బోటు ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌పై వైఎస్సార్సీపీ నేత, మరో మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నిరుద్యోగులు విషాద సంఘటనను ప్రచారానికి వాడుకోవడం విచారకరమన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారనడం తప్పు, బాధిత కుటుంబాలు మనోవేదనకు గురవుతాయన్నారు.

Must Read: బోటు బయటకు తీయలేం..! చేతులెత్తేసిన అధికారులు?

హర్షకుమార్‌పై గౌరవం ఉందంటూనే మాటలు వెనక్కు తీసుకోవాలని రవీంద్ర సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బోటు ప్రమాదం ఘటనను సంచలనాలకు, రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం తగదని హితవు పలికారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు. బాధితులకు సాయం చేస్తోందన్నారు. బుద్దుడి పేరు చెప్పి భూములు ఆక్రమించే టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకి వైఎస్సార్సీపీని విమర్శించే అర్హత లేదన్నారు.

Also Read: గోదావరి బోటు జాడ: ఎర్రనీళ్లతో ఇబ్బందులు? ఆ రిపోర్ట్ వచ్చాకే ఫుల్ క్లారిటీ!

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సమయంలో 73 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారని, కానీ బోటులో 93 మంది ఉన్నారని హర్షకుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన వద్ద విశ్వసనీయ సమాచారం కూడా ఉందని, కావాలనే అధికారులు గల్లంతైన వారి సంఖ్య తక్కువగా చెబుతున్నారని ఆరోపించారు కూడా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.