యాప్నగరం

ఫేక్‌ స్టోరీలు రాస్తారా: రిపబ్లిక్ టీవీ, ఆర్నాబ్ గోస్వామికి సజ్జల సంచలన వార్నింగ్

రిపబ్లిక్ టీవీకి, ఆ మీడియా సంస్థ సీఈవో ఆర్నాబ్ గోస్వామిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Samayam Telugu 8 Mar 2021, 11:19 pm
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ఇంగ్లిష్ చానల్ రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ టీవీని నడిపిస్తున్న ఆర్నాబ్ గోస్వామి జాతికి పట్టిన చీడ అని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడం దుర్మార్గమని ఫైరయ్యారు.
Samayam Telugu ఆర్నాబ్ గోస్వామిపై సజ్జల ఫైర్


ఈ నెల 4వ తేదీన కూడా సీఎం జగన్‌ సన్నిహితుడిపై ఈడీ కేసులంటూ ఫేక్ స్టోరీని ప్రసారం చేసిందని సజ్జల ధ్వజమెత్తారు. నేషనల్ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని సజ్జల తీవ్రంగా హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌పై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. వైసీపీలో ఎలాంటి సంక్షోభం కానీ, గందరగోళం కానీ లేవని స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసమే రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వార్చారన్న అనుమానం కలుగుతోందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ ఫేక్ కథనాలు ప్రసారం చేసిందని గుర్తు చేశారు. ఒక జాతియా మీడియా సంస్థగా ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, అశోక్‌గజపతిరాజు మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి అంశాలను వదిలి పెట్టి.. ఫేక్ కథనాలను వండి వారుస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఫేక్ కథనాల వెనక ఎవరున్నారో తెలుగు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక ఇలా వెనకుండి తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.