యాప్నగరం

ఏపీ సీఎం జగన్‌కు గుడి.. వైసీపీ ఎమ్మెల్యే చేతుల మీద శంకుస్థాపన

ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి దగ్గర ఈ గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అది కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజే శంకుస్థాపన జరగడం విశేషం.

Samayam Telugu 5 Aug 2020, 7:25 pm
ముఖ్యమంత్రి జగన్‌కు గుడి కట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. మీరు వింటున్నది నిజమే.. గుడికి శంకుస్థాపన కూడా చేసేశారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో ఆలయాన్ని కడుతున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి దగ్గర ఈ గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అది కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజే శంకుస్థాపన జరగడం విశేషం.
Samayam Telugu సీఎం జగన్‌కు గుడి


ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్‌ను దేవుడిలా కొలిచేందుకు గుడిని నిర్మిస్తున్నామని స్థానిక వైఎస్సార్‌సీపీ నేత నాగేశ్వర్రావు చెప్పారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఈ ఆలయ రూపంలో చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు దేశంలో ఎవరూ చేయని విధంగా వేల కిలోమీటర్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పాదయాత్ర చేశారన్నారు. ఈ గుడి నిర్మాణం పూర్తైతే సీఎం జగన్ చెంతకు ఎలాంటి దుష్ట శక్తులు చేరవన్నారు. సీఎం జగన్‌కు గుడి కట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.