యాప్నగరం

BJPకి చెక్ పెట్టడమే లక్ష్యంగా.. కేసీఆర్ బాటలో జగన్? టీడీపీకి ట్రబుల్స్..?

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు అధికార పార్టీ తెరతీయనుందా? బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడం కోసం వైఎస్ఆర్సీపీ చేరికలను ప్రోత్సహించనుందా? పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ఇదే.

Samayam Telugu 2 Aug 2019, 4:06 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఫ్యామిలీతో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే ముందు తెలంగాణ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లను కలిశారాయన. జగన్, కేసీఆర్‌లు దాదాపు 3 గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను తరలింపుపై చర్చ జరిగింది. విభజన సమస్యల పరిష్కారంపైనా ఇద్దరు సీఎంలు చర్చించారు. ఇక పార్టీల అధ్యక్షులుగా ఇద్దరి మధ్య.. బీజేపీ బలపడుతున్న తీరు చర్చకు వచ్చిందని సమాచారం.
Samayam Telugu jagan  modi


తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సభ్యత్వ నమోదుతోపాటు ‘ఆపరేషన్ కమలం’కి శ్రీకారం చుట్టింది. ఈ శ్రావణ మాసంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. కాషాయ దళం దూకుడును అడ్డుకోవడం కోసం ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగాలని జగన్, కేసీఆర్ నిర్ణయించారు.

ఏపీ, తెలంగాణల్లో బలపడటం కోసం బీజేపీ అనుసరిస్తోన్న వ్యూహం చేరికలను ప్రోత్సహించడం. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో కేసీఆర్ కూడా చేరికలను ప్రోత్సహించారు. ఇప్పటికీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని జగన్ అవలంభిస్తారని టాక్.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ తమను టార్గెట్ చేస్తుందోననే భయంతో టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. కమల దళం కూడా టీడీపీ నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. దీంతో ఆటోమెటిగ్గా బీజేపీలో కొత్త ‘నాయకులు’ పుట్టుకొస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ ఎంతో కొంత బలం పుంజుకోవడం ఖాయం. ఇప్పటికే ఏపీలో బీజేపీ నేతలు జగన్ సర్కారుపై విమర్శలను మొదలుపెట్టారు. కానీ రాష్ట్రానికి నిధులు రావాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ సంయమనం పాటిస్తోంది.

బీజేపీ జోలికి వెళ్లకుండానే ఆ పార్టీ దూకుడు చెక్ పెట్టాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం చేరికలను ప్రోత్సాహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహించబోమని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీంతో ఓడిన నేతలను ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చే నాయకులను వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని సమాచారం. నిజంగానే జగన్ ఓకే అంటే మాత్రం.. అటు వైఎస్ఆర్సీపీ, ఇటు బీజేపీ.. టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.