యాప్నగరం

‘జనసేన ఎమ్మెల్యే రాపాకకు ఉన్న జ్ఞానం కూడా పవన్‌ కళ్యాణ్‌కు లేదు’

రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 16 Feb 2020, 12:22 am
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ ఇచ్చే ప్యాకేజీలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లొంగిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్‌.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్‌‌ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu pjimage (45)


Also Read: అమరావతిపై ఒట్టు వేయను.. నేనేమైనా ముఖ్యమంత్రినా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటనను ఎమ్మెల్యే ఆర్కే తప్పుపట్టారు. ఈ మేరకు శనివారం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు లేదని ఎద్దేవా చేశారు.

రైతులను చంద్రబాబు మోసం చేసినప్పుడు ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటించలేదని ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగిపోయి ఇప్పుడు రాజధాని ప్రాంతానికి వచ్చి వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్‌ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని విమర్శించారు.

Also Read: అదే జరిగితే బీజేపీతో జనసేన పొత్తు ఉండదు.. పవన్ కళ్యాణ్ సంచలనం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక కూడా మద్దతు పలుకుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. కానీ, పవన్‌ కళ్యాణ్ మాత్రం అమరావతి రైతులనే కాకుండా జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Also Read: అలాగైతే పవన్‌ కళ్యాణ్‌పై ‘దిశ’ కేసు.. వైసీపీ అటాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.