యాప్నగరం

గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. పేదల దగ్గర డబ్బు వసూలు చేసి.. అవి తీసుకెళ్లి నేతలకు ఇస్తున్నారని సంచలన ఆరొపణలు.

Samayam Telugu 17 Feb 2020, 12:13 pm
గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఆ డబ్బును తీసుకెళ్లి నేతలకు ఇస్తున్నారని కర్నూలు జిల్లా మంత్రాలయం ఆరోపించారు. ఒకవేళ వాలంటీర్లకు ఇష్టం లేకపోతే ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోవచ్చు అన్నారు. ఇకపై ఎవరైనా ఇలా డబ్బు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Samayam Telugu cm


అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా గ్రామవాలంటీర్లపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. అందులోనూ వాలంటీర్లు డబ్బు వసూలు చేసి నేతలకు ఇస్తున్నారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు కూడా షాక్ తిన్నారట. ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిచేసేలా చూడాలి కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదనే భావనను వ్యక్తం చేస్తున్నారట.

గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతికి తావు లేకుండా అందరూ పనిచేయాలని సూచించారు. వాలంటీర్లు ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించేలా.. వారి సమస్యల్నిపరిష్కరించి భరోసా నింపేలా ఉండాలన్నారు. కానీ అక్కడక్కడా వాలంటీర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ల ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.