యాప్నగరం

నాపై తప్పుడు ప్రచారం.. ఆ కార్లు నావి కాదు: వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్

తాను బంధువులతో కలిసి హల్‌చల్‌ చేశానంటూ దుష్ప్రచారం చేశారన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్. చెక్‌పోస్ట్‌ దగ్గర ఆగి ఉన్న కారులన్నీ తనవేనని అసత్య ప్రచారం చేశారని.. తాను పోలీసుల మాటను గౌరవించి నియోజకవర్గంలో తాను ఒక్కడినే వచ్చానన్నారు.

Samayam Telugu 16 Apr 2020, 7:29 am
చిత్తూరు జిల్లా మదనపల్లె చెక్‌పోస్ట్ దగ్గర బంధువులతో హల్‌చల్‌ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. తనపై దుష్ప్రచారం జరుగుతోందని.. తాను ప్రయాణించిన కారు వెనుక తన అనుచరుల కారు ఒక్కటే ఉందని.. మదనపల్లి చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు అభ్యంతరం తెలపడంతో.. వెంటనే ఆ కారును కూడా వెనక్కి పంపినట్లు చెప్పుకొచ్చారు.
Samayam Telugu mla


Also Read: తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే.. ఏపీ సీ'ఐ'డీ

ఇక తాను బంధువులతో కలిసి హల్‌చల్‌ చేశానంటూ దుష్ప్రచారం చేశారన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్. చెక్‌పోస్ట్‌ దగ్గర ఆగి ఉన్న కారులన్నీ తనవేనని అసత్య ప్రచారం చేశారని.. తాను పోలీసుల మాటను గౌరవించి నియోజకవర్గంలో తాను ఒక్కడినే వచ్చానని.. లాక్‌డౌన్‌ నిబంధనలను సంపూర్ణంగా పాటించాలని.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను అన్నారు కనిగిరి ఎమ్మెల్యే.

Read Also: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ జీవోలపై సుప్రీంకోర్టుకు!

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దులో మదనపల్లె దగ్గర ఎమ్మెల్యే బెంగళూరు నుంచి వచ్చారు. చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు.. లాక్‌డౌన్‌ దృష్ట్యా ఏపీలోకి వచ్చేందుకు అనుమతించేది లేదన్నారు. మదనపల్లె డీఎస్పీ రంగంలోకి దిగారు.. వెంటనే పరిస్థితి సద్దుమణిగింది. దీంతో ఎమ్మెల్యే మాత్రం ఏపీలోకి రాగా.. ఆయన వెంట వచ్చిన అనుచరులు తిరిగి వెనక్కు బెంగళూరు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మాత్రం సొంత ఊరైన ప్రకాశం జిల్లా కనిగిరి వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.