యాప్నగరం

YS Jagan: జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

'వైఎస్సార్‌సీపీ స్థాపించిన తర్వాత విజయమ్మ తర్వాత ఎమ్మెల్యేను నేనే. నా కంటే వెనుక పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కాయి. జగన్‌ను ఉరి తీయాలి అన్నవాళ్లకు సీట్లు ఇచ్చారు' అంటూ సంచలన వ్యాఖ్యలు

Samayam Telugu 22 Jan 2020, 3:24 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేనే రుస,రుసలాడారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అనుచరులతో తన ఆవేదనను చెప్పుకొచ్చారు. పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన వారిలో తాను ముందు ఉన్నా.. తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాకు చేరడంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Samayam Telugu jagan.


Also Read: టీడీపీకి షాకిచ్చిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. అదే దారిలో మరో ఇద్దరు

తనకంటే వెనుక పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కాయని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపునరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ.. గతంలో వైఎస్ విజయమ్మను.. విజయ అంటూ ఏకవచనంతో పిలిచి అగౌరవపరిచారని గుర్తు చేశారు. జగన్‌ను, వారి కుటుంబాన్ని చాలా దారుణంగా విమర్శించినా బొత్సకు మంత్రి పదవిచిచ్చారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Read Also: తూ.గో: ప్రియురాలి ఇంటికి ఉన్మాది నిప్పు.. ఇద్దరు సజీవ దహనం, నలుగురికి తీవ్ర గాయాలు

అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు జగన్‌ను ఉరితీయాలి అన్నారని.. అయినా పార్టీలోకి చేర్చుకుని సీటిచ్చారని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబాన్ని దూషించినవారికే మంత్రి పదవులు ఇచ్చారని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.. అయినా తాను బాధపడలేదు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారగా.. పార్టీలోనూ నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.