యాప్నగరం

‘లోక్ సభలో వైసీపీ రౌడీయిజం’.. వీడియో షేర్ చేసిన లోకేశ్

కియా మోటార్స్ తరలింపు వార్త పార్లమెంట్‌లోనూ హీట్ పెంచింది. ఈ విషయమై టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య వాగ్యుద్ధం నడిచింది.

Samayam Telugu 6 Feb 2020, 7:53 pm
కియా మోటార్స్ తరలింపు వార్తలు లోక్ సభలోనూ హీట్ పుట్టించాయి. మార్చి నెలాఖారులోగా మిలీనియం టవర్స్‌ను ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు నోటీసులు ఇచ్చిందని టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ‘1.1 బిలియన్ డాలర్లతో ఏపీలో కియా ప్లాంట్‌ను పొరుగు రాష్ట్రాలకు వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడుల విషయమై మేం మాట్లాడుతున్నాం’ అని రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుండగా.. వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలగజేసుకున్నారు. రామ్మోహన్ నాయుడి సీటు దగ్గరికి వెళ్లి.. ఇది తప్పుడు ప్రచారం అని చెప్పే ప్రయత్నం చేశారు.
Samayam Telugu tdp vs ycp in loksabha


గోరంట్ల మాధవ్ తన సీటు దగ్గరకు రావడం పట్ల రామ్మోహన్ నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్‌గా సభలో మాట్లాడే హక్కు తనకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిసారీ ఆయన ఇలాగే అడ్డుతగులుతున్నారని శ్రీకాకుళం ఎంపీ విమర్శించారు. ఆయన వెనుకాలే కూర్చున్న మరో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా హిందూపురం ఎంపీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వీడియోను ట్వీట్ చేసిన నారా లోకేశ్.. ‘‘వైకాపా నాయకులకు చట్ట సభలు అంటే గౌరవం లేదు. వైకాపా సభ్యులు అసెంబ్లీలో రౌడీల్లా ప్రవర్తించారు. మండలి పరువు మంట గలిపారు. ఆఖరికి పార్లమెంట్ ని కూడా వదలలేదు. వైకాపా ఎక్కడైనా రౌడీయిజమే. సాటి సభ్యుడిపై దాడికి యత్నించారంటేనే వారి ఉన్మాద స్థాయి అర్ధం అవుతోంది’’ అని ట్వీట్ చేశారు. ఇదే గుండాయిజంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించొచ్చు కదా అని సెటైర్లు వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.