యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: యోగా క్లాసులు ప్రారంభించిన వైసీపీ ఎంపీ

Coronavirus: వైసీపీ ఎంపీ మార్గాని భరత్ యోగా తరగతులు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో ఎంపీ

Samayam Telugu 29 Mar 2020, 9:07 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ సందర్భంగా సెలబ్రిటీలు నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా లభించిన ఈ ఖాళీ సమయాన్ని పలువురు చక్కగా వినియోగించుకుంటున్నారు. కొందరు కుటుంబంతో జాలీగా గడుపుతుండగా.. మరికొందరు పెండింగ్‌లో పడ్డ పనులు చేసుకుంటున్నారు.
Samayam Telugu mp bharat yoga


లాక్ డౌన్‌లో భాగంగా ఎప్పుడూ జనాల్లో తిరిగే ప్రజా ప్రతినిధులు సైతం ఇళ్లకే పరిమితయ్యారు. దీంతో తమ కళలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబంతో హ్యాపీగా గడుపుతూ వంటలు చేస్తూ గడుపుతుండగా.. తాజాగా, వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ యోగా క్లాసులు ప్రారంభించారు.

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో యోగా వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇందులో యోగా డే 1 అని పేర్కొన్నారు. తద్వారా ప్రతి రోజూ యోగా వీడియోలు అప్‌లోడ్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ లాక్ డౌన్ రోజుల్లో యోగా తరగతులు పూర్తి చేసి, ప్రజల్లో చైతన్యం నింపాలని ఎంపీ భరత్ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.