యాప్నగరం

ఏపీలో హిందూ ఆలయాలపై కుట్ర.. రఘురామ Vs వైసీపీ ఎంపీలు.. లోక్‌సభలో గందరగోళం

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని లోక్‌సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అన్నారు.

Samayam Telugu 19 Sep 2020, 9:22 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్‌సభలో సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు జరగుతున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ రఘురామ ప్రసంగానికి వైసీపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ గందరగోళంలోనే ఎంపీ రఘురామ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Samayam Telugu ఎంపీ రఘురామ కృష్ణరాజు


Must Read: వారిపై చెయ్యి పడితే సీఎం జగన్‌పై వేసినట్లే.. మంత్రి కొడాలి నాని సీరియస్ వార్నింగ్

ఏపీలో హిందూ దేవాలయాలపై ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినట్లుగానే హిందువుల కోసం కూడా ఓ కమిషన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఒక్క వ్యక్తి (ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి) కోసం నిబంధనలే మార్చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి హిందువుల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కర్మయోగి అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టిసారించాలని కోరారు.

Also Read: ఏపీలో రూ.6,400 కోట్ల టెండర్లు రద్దు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

Dont' Miss: వైసీపీలో చేరింది టీడీపీ ఎమ్మెల్యే కుమారులే, గణేష్ మాత్రం.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.