యాప్నగరం

సీఎం జగన్‌కు మరో షాకిచ్చిన వైసీపీ ఎంపీ.. ప్రతిపక్షాల డిమాండ్‌కు మద్దతుగా..

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సీఎం జగన్‌కు షాకిచ్చారు. అమరావతికి జగన్ కూడా మద్దతు తెలిపారంటూ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 4 Jul 2020, 4:52 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి షాకిచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా అమరావతి రాగం ఎత్తుకున్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu సీఎం జగన్


ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అంశంపై శనివారం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతికి పర్యావరణ సానుకూలతలు ఎన్నో ఉన్నాయని, పాలనా రాజధానిగా అమరావతి ఉండటమే సమంజసమని వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని.. ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కూడా శాసనసభలో అమరావతికి మద్దతు తెలిపారని ఎంపీ రఘురామ గుర్తు చేశారు. పార్టీ పరంగా ఎన్నడూ అమరావతిని వ్యతిరేకించలేదన్నారు. అమరావతిలో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, అవసరమైన వసతులన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. కరోనా సంక్షోభంలో డబ్బు వృథా చేయడం సరికాదని ఎంపీ రఘురామ అన్నారు. వికేంద్రీకరణ తప్పనిసరి అయితే అమరావతిని పరిపాలనా రాజధాని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతికే మద్దతుగా ఉన్నారనేది తన విశ్వాసమని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ నుంచి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తప్పుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.