యాప్నగరం

మోదీకి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ

మరోవైపు ఇదే సమయంలో పలువురు వైసీపీ నేతలు ఢిల్లీకి బయల్దేరారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మోదీకి ఎంపీ రఘురామ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Samayam Telugu 2 Jul 2020, 4:35 pm
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ గా నడుస్తున్న టాపిక్ ఏదైనా ఉంటే అది వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మాత్రమే. తాజాగా ఆయన పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎంపీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం...దానిపై ఆయన స్పందించడం ఇవన్నీ జరిగాయి. ఇటీవలే ఆయన ఢిల్లీకి వెళ్లి ఇదే విషయమై పలువురిని పెద్దల్ని కలిశారు. తాజాగా ఎంపీ రఘురామ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం చేపడుతున్న పథకాలను కొనియాడుతూ ఎంపీ రాసిన లేఖ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కలవరం రేపుతోంది. గురువారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసి మరోసారి సంచలనం సృష్టించారు.
Samayam Telugu ఎంపీ రఘురామ, ప్రధాని మోదీ
ysrcp mp letter to pm modi


ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగింపుపై కృతజ్ఞతలు తెలుపుతూ మోదీకి రఘురామ లేఖ రాశారు. దూరదృష్టితో తీసుకున్న పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని ఆకాంక్షించారు. మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు లేఖలో కొనియాడారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రఘురామ హోంశాఖ కార్యదర్శితో పాటు.. కేంద్రమంత్రులు రాజ్ నాథ్, కిషన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. కేంద్రం బలగాలతో తనకు రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ గతంలో లేఖ రాశారు. తనకు షోకాజ్ నోటీసు పంపిన విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఎంపీ లేఖ రాసిన విషయం తెలిసిందే.

మరోవైపు పలువురు వైసీపీ ఎంపీలు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన మీద అనర్హత వేటు వేయించేందుకే ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలనే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.