యాప్నగరం

చంద్రబాబును అప్పుడే కలిశా.. నేను వైసీపీ నుంచి వెళ్లడానికి ఆయనే కారణం: రఘురామ

నన్ను బయటకు పంపాలనుకుని అక్రమ సంబంధం అంటగట్టారు.. ఒకవేళ పార్టీ తనను వద్దనుకుంటే ఏం ఇబ్బంది లేదని.. తాను ఎంపీని ప్రజలకు చేయాల్సిన సేవ చేస్తాను అంటున్నారు ఎంపీ.

Samayam Telugu 1 Jul 2020, 7:42 am
తన వెనుక చంద్రబాబు ఉన్నారని.. తాను ఆయన ట్రాప్‌లో పడ్డానని జరుగుతున్న ప్రచారం వింటే హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తనపై అర్ధంలేని విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబును నాలుగైదు నెలల క్రితం కలిశానని.. విమానంలో కనిపిస్తే నమస్కారం పెట్టాను అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, పెద్దాయన కాబట్టి గౌరవం ఇచ్చానని.. బావున్నారా అని చంద్రబాబు కూడా క్షేమసమాచారాలు అడిగారన్నారు. ఆయన తన వెనుక ఉన్నారనడం ఆశ్చర్యంగా ఉందని.. తనను బయటకు పంపాలనుకుని అక్రమ సంబంధం అంటగట్టారన్నారు.
Samayam Telugu రఘురామకృష్ణంరాజు


తనకు విజయసాయిరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవన్నారు రఘురామ. గతంలో తాను పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి వల్లభనేని బాలశౌరి కారణమని.. తాను పార్టీలో చేరినప్పుడు బాలశౌరి షాకయ్యారని ఆసక్తికర విషయాలు చెప్పారు. మళ్లీ తాను పార్టీలోకి రావడానికి విజయసాయిరెడ్డి, ప్రశాంత్ కిషోర్ కారణమన్నారు. బీజేపీకి 300మందికిపైగా ఎంపీలు ఉన్నారని.. తన అవసరం ఆ పార్టీకి లేదన్నారు. ఇప్పటికీ తనకు నమ్మకం ఉందని.. తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఒకవేళ పార్టీ తనను వద్దనుకుంటే ఏం ఇబ్బంది లేదని.. తాను ఎంపీని ప్రజలకు చేయాల్సిన సేవ చేస్తాను అంటున్నారు ఎంపీ. ప్రజలకు సేవచేయడానికి వచ్చాను.. వెట్టి చాకిరి చేయడానికి రాలేదన్నారు.. సేవ చేయడానికి పార్టీలతో పనిలేదన్నారు. అవినీతి జరుగుతుందని చెప్పినందుకు తన దిష్టిబొమ్మలు తగులబెట్టారని.. తనకు ఎప్పటి నుంచో ఇమేజ్ పరిచయాలు ఉన్నాయని.. పార్టీని అడ్డుపెట్టుకుని ఇమేజ్ పెంచుకోవాల్సిన అవసరం లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.