యాప్నగరం

కన్నడలో వైసీపీ ఎంపీ స్పీచ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిదా

కన్నడలో ప్రసంగంతో అదరగొట్టిన వైఎస్సార్‌ సీపీ ఎంపీ. వేదికపై చిరు నవ్వులు చిందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి సదానంద గౌడ.. స్పీచ్‌కు ఇద్దరూ ఫిదా.

Samayam Telugu 24 Oct 2019, 5:25 pm
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని (సీపెట్‌)ను సీఎం జగన్, కేంద్ర మంత్రి సదానంద గౌడలు ప్రారంభించారు. సీపెట్‌ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీపెట్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు జగన్. సీపెట్‌ లాంటి సంస్థలు మరిన్ని రావాలని.. ఇలాంటి సంస్థలను మరిన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలో సీపెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అందించిన సహకారం అభినందనీయం అన్నారు కేంద్రమంత్రి సదానంద గౌడ. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి సంస్థలు ఉపయోగపడతాయని.. మన యువతను సరైన విధానంలో ఉపయోగించుకుంటే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటామని ఆకాంక్షించారు.
Samayam Telugu mp


Read Also: 'జగన్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ లేట్.. ఏం జరిగిందంటే'

ఇదిలా ఉంటే.. సీపెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కన్నడలో మాట్లాడి ఆకట్టుకున్నారు. కేంద్రమంత్రి సదానంద గౌడ కర్ణాటక కావడంతో.. కన్నడలో ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఎంపీ కన్నడ ప్రసంగంతో సదానంద గౌడతో పాటూ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి జగన్ కూడా ఫిదా అయ్యారు.

బాలశౌరి కన్నడలో మాట్లాడుతూ.. రైతుల కోసం విరివిగా ఎరువులు, పురుగుమందులు వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. అలాగే రాష్ట్రంలో 5వేల మెగావాట్ల ధర్మల్ ప్రాజెక్టులకు ఉన్నాయని.. బొగ్గు లేదని.. కేబినెట్‌లో మాట్లాడి బొగ్గు వచ్చేలా సహాయం చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. బొగ్గు కొరతను తీర్చండి.. బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడి సాయం చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో పెట్రో కారిడార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. సగభాగం సదానంద గౌడ పరిధిలో ఉంటుందని.. ఈ మూడు విషయాలను మంత్రికి వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.