యాప్నగరం

తిరుపతి గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని.. బాబుకు వైసీపీ ఎంపీ కౌంటర్

తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారు. జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు. ఆ సరదా కూడా తీర్చుకుందురు అంటూ ఎంపీ ట్వీట్.

Samayam Telugu 12 Dec 2020, 12:03 pm
ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. నోటిఫికేషన్ రాకపోయినా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడు పెంచింది.. పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించింది. ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. తిరుపతిలో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజలు దూరమయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే బాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జనాలు క్లారిటీతో ఉన్నారని.. ఆ సరదా కూడా తీరిపోతుందంటూ ట్వీట్ చేశారు.
Samayam Telugu తిరుపతి ఉప ఎన్నిక


‘జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇరగదీసిన తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నా జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు. ఆ సరదా కూడా తీర్చుకుందురు’అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రంగంలోకి దిగారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి తిరుపతిలో అడుగు పెట్టారు. గురువారం ఆమె నగరానికి చేరుకున్నారు.. పార్టీ నేతలతో కలిసి నేరుగా అలిపిరి దగ్గరకు వెళ్లి.. ఉప ఎన్నికలో విజయం దక్కాలని తిరుమల వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు మొన్నటి వరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని పనబాక.. మళ్లీ తన అకౌంట్లలో పోస్టులు, ట్వీట్‌లు మొదలు పెట్టారు. తన రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. త్వరలోనే ఆమె ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు బీజేపీ కూడా పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇటు వైఎస్సార్‌సీపీ కొత్త స్ట్రాటజీతో దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబం కాకుండా అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని తెరపైకి తీసుకొచ్చింది.. ఆయనకు టికెట్ ఫైనల్ చేసింది.. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.