యాప్నగరం

Amaravati Farmers ఆ పని చేస్తే మంచిది.. వైసీపీ ఎంపీ విజయసాయి సలహా

అమరవాతిని రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒకసారి వారిని ఫణంగా పెట్టారు.. మళ్లీ వారినే అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నారు. ఆయన్ను పక్కన పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటున్న విజయసాయిరెడ్డి.

Samayam Telugu 24 Dec 2019, 11:55 am
మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ నివేదికతో అమరావతిలో రైతులు భగ్గుమన్నారు. వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతులకు మద్దతుగా అమరావతిలో పర్యటించారు. వారి పోరాటానికి తన సంఘీభావాన్ని తెలియజేశారు. రైతుల ఆందోళనలు, బాబు రాజధాని పర్యటనలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. రైతులకు ఓ సలహా ఇచ్చారు.
Samayam Telugu visa


చంద్రబాబును తుళ్లూరు రైతులను ఇంకోసారి నమ్మితే అంతకంటే అమాయకత్వం ఉండదన్నారు విజయసాయిరెడ్డి. తన బంధు వర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒకసారి వారిని ఫణంగా పెట్టారని.. మళ్లీ వారినే అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఎవరికీ అన్యాయం జరగదు.. బాబును దూరం పెడితే అన్నీ పరిష్కారం అవుతాయి అంటున్నారు.
ఇటు రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని చంద్రబాబు స్కెచ్ వేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆరోపించారు. అలా జరిగి ఉంటే వాటి విలువ 6-7 లక్షల కోట్లకు చేరేదని.. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.