యాప్నగరం

'మెడ్‌టెక్ ఘనత జగన్‌ది.. చంద్రబాబుది స్కామ్'

కేంద్రం మెడ్ టెక్ జోన్‌ను కేటాయిస్తే లడ్డూ దొరకినట్లుగా దాని నిర్మాణ వ్యయాన్ని 400 కోట్ల నుంచి 2500 కోట్లకు పెంచి లగడపాటికి అప్పగించి చంద్రబాబు స్కాం చేశారు. జగన్ నిధులు కేటాయించి కోవిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీ మొదలు పెట్టారు.

Samayam Telugu 10 Apr 2020, 12:32 pm
ఏపీలో కరోనాపై రాజకీయం వేడెక్కింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొన్నటి వరకు కరోనా సాయంపై జరిగిన రగడ తర్వాత మెడ్‌టెక్ జోన్, నర్సీపట్నం డాక్టర్ వ్యవహారంపై మళ్లింది. మెడ్‌‌టెక్ ఘనత తమదని టీడీపీ అంటుంటే.. కాదు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తాము నిధులు కేటాయించామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తాజా పరిణామాలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.. మెడ్‌టెక్‌ పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
Samayam Telugu cbn


వైద్య పరికరాల తయారీ కోసం కేంద్రం మెడ్ టెక్ జోన్‌ను కేటాయిస్తే లడ్డూ దొరకినట్లుగా దాని నిర్మాణ వ్యయాన్ని 400 కోట్ల నుంచి 2500 కోట్లకు పెంచి లగడపాటికి అప్పగించి చంద్రబాబు స్కాంకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జగన్ గారు నిధులు కేటాయించి కోవిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీ మొదలు పెట్టించారు అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణనున టార్గెట్ చేశారు. 'కన్నా గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడో, పసుపు చొక్కా వేసుకున్న బాబు మనిషో అర్థమై పోయింది ప్రజలందరికీ. ఆయనకు నొప్పిలేస్తే ఈయన మందు పూసుకుంటున్నాడు. ఆయన ఊ.. అనకముందే ఈయన రెచ్చి పోతున్నాడు. కన్నా ఒక్కరిని కొనగలవేమో కాని బిజెపిలో వ్యక్తిత్వం ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు విజనరీ' అంటూ సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.