యాప్నగరం

'నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియదా'.. లోకేష్‌‌పై సెటైర్లు

జయంతికి వర్థంతికి తేడా తెలియకుండా అభాసుపాలయ్యారు.. ఇప్పుడు నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు. మంగళగిరిలో ఓడిపోయినా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నారు.

Samayam Telugu 25 Nov 2019, 12:19 pm
టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లపై ట్విట్టర్‌లో మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ సర్కార్‌పై బాబు అండ్ కో కుట్రలు చేస్తోందని.. బాబుకు ప్రతిపక్ష హోదా కూడా కష్టమేనంటూ సెటైర్లు పేల్చారు. నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియదంటూ లోకేష్‌ను ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.
Samayam Telugu lokesh


‘తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తిన మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు. గతంలో జయంతికి వర్ధంతికి బేధం తెలియకుండా మాట్లాడి అభాసుపాలయ్యాడు. మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నాడు’అంటూ సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి.
‘ఐదు నెలల్లోనే ఎన్ని అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేయాలో అన్నీ చేశారు. ఎల్లో మీడియా రేయింబవళ్ళు గింజుకుంటున్నా వారి కుయుక్తులను ప్రజలు పసిగట్టేశారు. దోపిడీ పాలన పోయినందుకు సంతోషంగా ఉన్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా తట్టుకుంటారో చంద్రబాబు దొంగల బ్యాచ్’అంటూ ఘాటు ట్వీట్ చేశారు.
‘వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఐదారుగురైనా మిగిలేది అనుమానమే. నారా లోకేష్ రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండక పోవచ్చు. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారు’అంటూ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.