యాప్నగరం

ట్రైలర్ అయ్యింది.. ఇక సినిమానే: వైసీపీ ఎంపీ ఆసక్తికర ట్వీట్

జగన్ ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతారో అంటూ ఎంపీ సెటైర్లు పేల్చారు.

Samayam Telugu 10 Jul 2020, 12:12 pm
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఘాటుగా ట్వీట్‌లు చేశారు. జగన్ ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతారో అంటూ సెటైర్లు పేల్చారు. అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయారు.. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే అన్నారు.
Samayam Telugu లోకేష్, చంద్రబాబు

మరో ట్వీట్‌లో.. చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే.. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసిందని.. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది అన్నారు.

ఇదిలా ఉంటే విజయసాయికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు మామ విజయసాయిరెడ్డి.. నిజమే ట్రైలర్‌కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు. ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ.. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం అంటూ కాస్త ఘాటుగా స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.