యాప్నగరం

‘ఏపీలో కరోనా కేసులు పెరగాలని, జగన్‌పై నింద వేయాలని వీళ్లు కాచుక్కూర్చున్నారు..’

Chandrababu Naidu: ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరగాలని కొందరు కాచుక్కూర్చుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే చంద్రబాబుపై ఫైరయ్యారు.

Samayam Telugu 4 Apr 2020, 1:03 pm
ఏపీలో కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu pjimage - 2020-03-28T154130.536


‘‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇలాంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారు. సీఎం జగన్ కరోనా వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారు’’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

‘‘కృష్ణా నదికి వరదొస్తే కరకట్ట కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రి హైదరాబాద్ పారిపోయారు. కరోనా వైరస్ ప్రబలుతుందనగానే పెట్టేబేడా సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడు. మూడడుగుల దూరం పాటించమంటే మూడొందల కిలోమీటర్లు పారిపోయిన నువ్వు సుద్దులు చెప్పటమేంటీ బాబూ? కర్మ కాకపోతే!’’ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.