యాప్నగరం

YS Jaganను జైలుకు పంపారు, చంపాలని చూశారు.. విజయసాయిరెడ్డి భావోద్వేగం

తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అఖండ విజయం సాధించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Samayam Telugu 23 May 2020, 1:41 pm
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu సీఎం జగన్, విజయసాయిరెడ్డి


‘‘తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిలిచారు యువనేత.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

‘‘ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, రూ. వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు.’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.