యాప్నగరం

అది ఏపీ సెంటిమెంట్! కాస్త మైండ్‌లో పెట్టుకుని.. కేంద్రంపై విజయసాయి కీలక వ్యాఖ్యలు

దేశంలోనే అధిక ఆదాయం వచ్చే డివిజన్లలో వాల్తేరు ఐదో స్థానంలో ఉంది. నార్త్ ఈస్టర్న్, నార్త్ వెస్టర్న్ డివిజన్లతో పోలిస్తే ఆదాయం ఎక్కువ. వాల్తేరు డివిజన్‌ను తరలించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

Samayam Telugu 20 Nov 2019, 4:37 pm
వాల్తేరు రైల్వే డివిజన్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. వాల్తేరు డివిజన్‌పై కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యంగా లేవని.. భౌగోళికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
Samayam Telugu Vijay-Sai-Reddy


వాల్తేరు రైల్వే డివిజన్‌‌ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని..‌ డివిజన్ తరలింపు నిర్ణయం సరికాదని ఎంపీ విజయసాయి అన్నారు. దేశంలోనే అధిక ఆదాయం వచ్చే డివిజన్లలో వాల్తేరు ఐదో స్థానంలో ఉందని గుర్తు చేశారు. నార్త్ ఈస్టర్న్, నార్త్ వెస్టర్న్ డివిజన్లతో పోలిస్తే ఆదాయం ఎక్కువని, వాల్తేరు డివిజన్‌ను విజయవాడకు తరలించాలన్న ఆలోచనను విరమించుకోవాలని కోరారు.

Also Read: కాలేజ్ హాస్టల్ పక్కనే కాల్‌గర్ల్స్.. గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
విశాఖపట్నం నుంచి విజయవాడకు 350 కిలోమీటర్ల దూరం ఉందని విజయసాయి తెలిపారు. డివిజన్ తరలిస్తే నిర్వహణ కష్టమవుతుందన్నారు. కొత్తగా మౌలిక వసతుల కల్పన కూడా ప్రభుత్వానికి భారమవుతుందని పేర్కొన్నారు. డివిజన్ మార్పు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. ప్రకృతి విపత్తులు.. ప్రమాద సమయాల్లో సహాయక చర్యలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

వాల్తేరు డివిజన్‌కు 125 ఏళ్ల చరిత్ర ఉందన్న విజయసాయి.. అది ఏపీ ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశమన్నారు. సెంటిమెంట్‌ను గౌరవించి వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు. డివిజన్ తరలింపు నిర్ణయం పెద్ద పొరపాటని విజయసాయి వ్యాఖ్యానించారు. తక్షణమే సదరు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని.. ప్రత్యేకించి రైల్వే శాఖ మంత్రిని కోరుతున్నామన్నారు.

Read Also: నాని.. వంశీ.. ఇక్కడెవరూ గాజులు తొడుక్కోలా! నందమూరి వారసుడి స్ట్రాంగ్ వార్నింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.