యాప్నగరం

BJP పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు.. పవన్‌పై విజయసాయి సెటైర్లు

Janasena | మూడు రాజధానుల విషయంలో పవన్ కళ్యాణ్‌పై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు, దీంతో తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడంటూ ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 23 Jan 2020, 2:11 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల విషయంపై ముందు ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని.. యూ టర్న్‌ల్లో యజమాని చంద్రబాబునే ఆయన మించిపోయాడని విజయసాయి సెటైర్లు వేశారు. ‘‘దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Samayam Telugu pawan


ఢిల్లీ వెళ్లిన పవన్.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేందుకు కలిసి పని చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పే మూడు రాజధానులు చేస్తున్నట్లు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో వాస్తవం లేదన్నారు. ఇప్పుడు తాను కేంద్రాన్ని కలిసే చెప్తున్నానని, మూడు రాజధానులకు కేంద్రం సమ్మతం లేదని వెల్లడించారు.

తాజాగా నడ్డాను కలిసిన అనంతరం పవన్ మరోసారి మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులను మోదీ, అమిత్ షా అనుమతితోనే చేస్తున్నామన్న వైసీపీ నేతల మాటల్లో నిజం లేదని పవన్ తెలిపారు. మూడు రాజధానులు అనేది రాష్ట్ర ప్రజల కోసం కాదు.. వైసీపీ నేతల భూ దందాతోనే అని జనసేనాని తెలిపారు. మూడు రాజధానుల అంశంలో ప్రధాని, హోం మంత్రి పాత్ర లేదని పవన్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.