యాప్నగరం

బాబు గారు.. మరో చెత్త సినిమా వదిలారు.. విజయసాయి

ఎన్నికల తర్వాత విడుదల చేసిన మూడో సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ రెండు సినిమాల తర్వాత చంద్రబాబు మరో చెత్త సినిమా వదిలారంటూ విజయసాయి సెటైర్లు వేశారు.

Samayam Telugu 13 Sep 2019, 11:19 am
చాన్స్ దొరికితే చాలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల బాణాలు సంధిస్తుంటారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తాజాగా చలో ఆత్మకూరు కార్యక్రమంపై బాబును టార్గెట్ చేశారు. మూడో సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని, ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మరో చెత్త సినిమా వదిలాడంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వంపై పడి ఏడుస్తూ రోజురోజుకీ దిగజారిపోతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu dc-Cover-pr.


Must Read : జగన్ దగ్గర ఆ పప్పులేమీ ఉడకవ్.. చంద్రబాబుపై మంత్రి బొత్స ఘాటు విమర్శలు

గతంలో తీయించుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయన్న విజయసాయి మూడో సినిమా చలో ఆత్మకూరు కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుంటే ఏడుపుగొండితనంతో చంద్రబాబు మరింత పతనమవుతున్నారని విమర్శించారు.

Also Read :దళితులంటే ఎందుకంత చులకన? డిప్యూటీ సీఎం ఫైర్

అంతటితో ఆగని విజయసాయి దోచుకున్న సొమ్మును కాస్తయినా పంచమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. వరదలొచ్చిన ప్రతిసారీ వేల మంది ఆశ్రయం కోల్పోయి, ఇళ్లు, పంటలు దెబ్బతిన్న విషాద దృశ్యాలు కనిపిస్తుంటాయన్నారు. కానీ చంద్రబాబుకి వరదలు కోట్లు కుమ్మరిస్తాయని, వరదల వల్ల వచ్చే ఇసుక బాబు గారికి కనక వర్షం కురిపిస్తుందన్నారు. ఇసుక దందాలో దోచుకున్న సొత్తులో కొంతయినా వరద బాధితులకు అందజేసి ఆదుకోవాలని, లేకపోతే లావైపోతారంటూ సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.