యాప్నగరం

‘బిల్ గేట్స్‌తో బాబుకు ఫోన్ చేయించడానికి ప్రయత్నించారు.. కానీ’

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయించడానికి ఢిల్లీలోని ఆయన కోవర్టులు విఫలయత్నం చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చిత్తుగా ఓడాక బాబు సౌండ్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 19 Nov 2019, 6:04 pm
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చిత్తుగా ఓడిపోయాక చంద్రబాబుకు సౌండ్ లేకుండా పోయిందన్న ఆయన.. లేకపోతే బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేసింది తనేనని కోతలు కోసేవాడని ఎద్దేవా చేశారు. గేట్స్‌ను ఇండియాకు రప్పించడానికి తన పరపతినంతా ఉపయోగించానని కూడా చెప్పేవాడన్నారు. గేట్స్‌తో బాబుకు ఫోన్ చేయించడానికి ఢిల్లీలోని ఆయన కోవర్టులు విఫలయత్నం చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
Samayam Telugu bill gates babu


1997లో మైక్రోసాఫ్ట్ అధినేత భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో ఉన్న ఆయనతో భేటీ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబుకు బిల్ గేట్స్ 10 నిమిషాల సమయం కేటాయించారు. కానీ బాబు ప్రజెంటేషన్ నచ్చడంతో 40 నిమిషాలకుపైగా బిల్‌గేట్స్ సమయాన్ని వెచ్చించారు.
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు బిల్ గేట్స్ అంగీకరించారు. ఆయన్ను బెంగళూరు తీసుకెళ్లడం కోసం ఎస్ఎం కృష్ణ తీవ్రంగా ప్రయత్నించారని.. కానీ గేట్స్ మాత్రం హైదరాబాద్ వచ్చారని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు.

‘‘మొదట కులాల మధ్య చిచ్చు పెట్టి అశాంతి సృష్టించాలని చూశారు. ప్రజలు చైతన్యవంతులై వీళ్ల రెచ్చగొట్టే ప్రయత్నాలను ఈసడించుకోవడంతో ఇప్పుడు మతం పేరిట ప్రజలను చీల్చాలని కంకణం కట్టుకున్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఎల్లో మీడియా, పార్టనర్లిద్దరూ రోజుకో రకంగా విషం చిమ్ముతున్నార’’ని చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశించి విజయసాయి మరో ట్వీట్ చేశారు.

Read Also: జగన్‌ను అలా పిలవడంలో ఇబ్బందేంటి పవన్?

‘‘కిరసనాయిలు మాటలు, రాతలు చూస్తుంటే ఆయనకు ఆరు నెలలుగా నిద్ర పడుతున్నట్టు లేదు. బాబు పతనంతోనే అక్రమార్జన నిలిచిపోయింది. అసూయ, కడుపుమంట, మానసిక క్షోభతో మైండ్ కంట్రోల్ తప్పినట్టుంది. ఇంగ్లీష్ మీడియం మతం మార్చటానికట! పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరు’’ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మరో ట్వీట్ చేశారు.

Read Also: ఆదాయానికి మించి ఆస్తుల కేసు.. బాబు జైలుకెళ్తారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.