యాప్నగరం

TDP నేతలు నాలుక మడతేస్తున్నారు: వైసీపీ ఎంపీ సెటైర్లు

స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలన్న టీడీపీ నేత యనమల వ్యాఖ్యల పట్ల వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.

Samayam Telugu 20 Mar 2020, 3:17 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదం నడుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వర్సెస్ సీఎం అనేంతగా ఈ వివాదం నడిచింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. జగన్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ పేరిట కేంద్రానికి లేఖ వెళ్లడంతో.. ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
Samayam Telugu vijay-sai-reddy


టీడీపీ కూడా కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్న సంగత తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని.. తమ పార్టీ వాళ్లు నామినేషన్లు వేయకుండా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర బలగాల పహారాలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని యనమల లాంటి నేతలు కోరుతున్నారు.

ఈ విషయమై యనమలకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలని యనమల గారు డిమాండు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సీబీఐని నిషేధించినోళ్ళు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప’’ అని ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.