యాప్నగరం

బోటు వెలికితీత: ధర్మాడి సత్యం ఎవరికీ తెలిసేవారు కాదు.. విజయసాయి హాట్‌కామెంట్స్

గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ నది నుంచి వెలికితీసిన విషయం తెలిసిందే. దేశమంతా ఆయన సేవలను హర్షిస్తోందని ఎంపీ విజయసాయి అన్నారు. చంద్రబాబు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 27 Oct 2019, 3:26 pm
టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గోదావరిలో బోటు వెలికితీతను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారంటూ విమర్శలు గుప్పించారు. గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం శ్రమను కూడా తన ఖాతాలో వేసుకునే వారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోదావరి నుంచి బోటును వెలికితీసేందుకు సత్యం టీమ్ శ్రమించిందని, దేశమంతా ఆయన సేవలను హర్షిస్తోందని విజయసాయి పేర్కొన్నారు.
Samayam Telugu _109328314_boatsearching3


అదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేవారని విజయసాయి విమర్శించారు. చంద్రబాబే దగ్గరుండి బోటును వెలికితీయించారని ప్రచారం చేసుకునే వారని దుయ్యబట్టారు. ధర్మాడి సత్యం పేరు ఎవ్వరికీ తెలిసేది కాదన్నారు. తానే డైవర్లకు గైడెన్స్ ఇచ్చి గొలుసులు వేసి పడవను బయటకు లాగాడని కుల మీడియా బాకాలూదేదంటూ ఘాటు విమర్శలు చేశారు.

Also Read: కాపురంలో చిచ్చుపెట్టిన టిక్‌టాక్.. ఇబ్రహీంపట్నంలో దారుణం

టీడీపీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారంటూ విజయసాయి విమర్శలు చేశారు. అమరావతి చుట్టూ భూముల ధరలు పడిపోవడమే దానికి కారణమన్నారు. వర్క్ ఆర్డర్లు లేకుండా సిమెంట్లు రోడ్లు వేసిన వారి బిల్లులు ఆగాయని, పోలవరం, హంద్రీనీవా కాంట్రాక్టర్ల తొలగింపు గురించే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని విమర్శలు చేశారు.

గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీమ్ వెలికితీసిన సంగతి తెలిసిందే. బోటు మునిగిన వారం రోజులకే వెలికితీత ఆపరేషన్ చేపట్టినా గోదావరిలో వరద ఉధృతి కారణంగా నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే మరోసారి సత్యం బృందం వెలికితీత పనులను చేపట్టింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా వెరవకుండా బోటును బయటకు తీసి ఒడ్డుకు చేర్చింది. బోటును విజయవంతంగా బయటకు తెచ్చిన ధర్మాడి సత్యం టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.