యాప్నగరం

కావాల్సినంత కామెడీ పంచుతున్నాడట! విజయసాయి పంచ్‌లు

సీఎం జగన్‌ను ఉద్దేశించి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడి కొనసాగుతోంది. వైసీపీ నేతలు లోకేష్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. ఎంపీ విజయసాయి మరో అడుగు ముందుకేసి మాలోకం అంటూ రెచ్చిపోయారు.

Samayam Telugu 24 Jun 2021, 3:54 pm
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఒంటికాలిపై లేచే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు సెటైర్లతో రెచ్చిపోయారు. నారా లోకేష్‌ని టార్గెట్ చేస్తూ నోటికి పనిచెప్పారు. లోకేష్‌కి ఇంకా చిన్నప్పటి లోకంలో నుంచి బయటికి రాలేదని.. అప్పుడు కొనిచ్చిన పులిబొమ్మలను చూసి బొబ్బలు పెడుతున్నాడని విమర్శించారు. తాను సింహాన్ని, పులిని అంటూ బీరాలు పలుకుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. తన పుత్రరత్నం ఇంత దద్దమ్మ అవుతాడని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాలోకం కావాల్సినంత కామెడీ పంచుతున్నాడంటూ పంచ్‌లు విసిరారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vijayasai



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.