యాప్నగరం

ఎన్ని జాకీలు పెట్టినా కష్టమే! చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 5 Oct 2019, 3:31 pm
ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య సోషల్ వార్ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. మీడియాలో అసత్య ప్రచారానికి ఆద్యుడు బాబేనని, ఆయన ఆరోపణలు చేయడం దొంగే దొంగ అరుస్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు.
Samayam Telugu Chandrababu-Naidu-770x433


అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బురదజల్లడం చంద్రబాబుకు నలభై ఏళ్లుగా అలవాటేనని విజయసాయి విమర్శించారు. వైఎస్సార్సీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన దాకా వచ్చే సరికి తనే బాధితుడినన్నట్టు అనుకూల మీడియాలో శోకాలు పెడుతున్నాడన్నారు. తన వరకు వస్తే కానీ ఆ బాధేమిటే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ‘జగన్.. ఆలయ సంప్రదాయాలు పట్టవా? ’

తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచే పచ్చమీడియాలో అభూత కల్పనలు రాస్తూ ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆరోపించారు. 1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని విమర్శలు గుప్పించారు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరంటూ వ్యాఖ్యానించారు.

Read Also: అమ్మవారిని ఆ కోరిక కోరా.. ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ప్రెజెంటేషన్‌పై విజయసాయి సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని ప్రజెంటేషన్లతో చావగొట్టాడంటూ హేళన చేశారు. ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించి పాతాళంలోకి జారిపోయాడని విమర్శలు చేశారు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా చంద్రబాబును బయటకు లాగలేదని విజయసాయి ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.