యాప్నగరం

‘జగన్ తపనకు కార్యరూపం రేపటి నుంచి చూస్తారు’

సీఎం జగన్ తపనకు కార్యరూపం రేపటి నుంచి చూస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా అంబులెన్స్ సేవలు జులై 1 నుంచి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.

Samayam Telugu 30 Jun 2020, 7:38 am
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ హస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దడం కోసం నాడు-నేడు పేరిట అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి మరికొన్ని 108, 104 నూతన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 203.47 కోట్లతో అంబులెన్స్ వాహనాలు కొనుగోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 108 వాహనాలకు సంబంధించి 412 కొత్త వాహనాలు వస్తున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జన్ రావు తెలిపారు.
Samayam Telugu jagan


104 వాహనాలు కొత్త మరో 656 వరకు వస్తాయని ఆరోగ్య శ్రీ సీఈవో తెలిపారు. ప్రతి జిల్లాలో 108లో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయి. ఈ అంబులెన్స్‌ల్లో మొబైల్ వెంటిలేటర్‌, ఈసీజీతోపాటు అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది.

ఈ విషయమై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ప్రజారోగ్యం పట్ల సిఎం జగన్ గారి తపనకు కార్యరూపం జూలై 1 నుంచి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 203 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక 104, 108 అంబులెన్సులు, మొబైల్ క్లినిక్‌ల సేవలు మొదలవుతాయి. వెంటిలేటర్లు, ఈసీజీ, ప్రాణాపాయ స్థితిలో అత్యవసర లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు వీటిల్లో ఉంటాయి’’ అని విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలో ఉన్న అంబులెన్స్‌లను మూలకు పడేస్తే.. జగన్ సీఎం అయ్యాక కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారని అర్థం వచ్చేలా ఆయన మరో ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.