యాప్నగరం

రాష్ట్రంలో అన్నదాత కన్నీరు.. గప్పాలు చెప్పుకోవడానికే వడ్లు కొంటామని చెప్పిండు: వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా తీవ్ర విమర్శలు గుప్పించారు. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునే వరకు కేసీఆర్ రైతులను అరిగోస పెడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 12 May 2022, 2:01 pm
యాసంగి వడ్లు కొంటామని రైతులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు. అసని తుపానుతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. ధాన్యం తడిసిపోతుతందనే భయంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 17 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు.
Samayam Telugu వైఎస్ షర్మిల


'వడ్లు తడిసిపోయి అన్నదాత కన్నీరు పెడుతుంటే చూడలేని గుడ్డోని పాలన కేసీఆర్ గారిది. ఆదుకొంటాడు అనుకొన్న దొరగారు వడ్లు కొనని పుణ్యానికి ఎకరాకు రూ.10 వేలు నష్టం. విత్తనం నాటిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునేవరకు కేసీఆర్ రైతులను అరిగోస పెడుతూనే ఉన్నారు. ఇక రైతును ఆదుకునేదెవరు..? వడ్లు కొంటానన్న కేసీఆర్ హామీ గాలివానలకు కొట్టుకుపోతే కల్లాల్లో వడ్లు వర్షాలకు తడిసిపోతే రైతు కన్నీరు తుడిచేదెవరు..? గప్పాలు చెప్పుకోవడానికే వడ్లు కొంటామని చెప్పిండు తప్ప కొన్నది లేదు. 7 వేల కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు రూ.500 ఎక్కువిచ్చి కొంటామన్న కేసీఆర్ ఏతుల మాటలు ఎక్కడపోయాయి..?' అని వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె ట్వీట్టర్‌లో వార్తకథనాలు పోస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.