యాప్నగరం

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఫైనల్?.. మూడు పేర్లు ఊహించినవే.. ఆ ఒక్కటే అనూహ్యం

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని దాదాపు ఫైనల్ చేసిన అధినేత జగన్. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డిలకు అవకాశం. నాలుగో సీటు అంబానీ సన్నిహితుడు నత్వానికి కేటాయింపు.

Samayam Telugu 9 Mar 2020, 5:18 pm
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఫైనలయ్యారు. వైఎస్సార్‌సీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే నలుగురు అభ్యర్థుల్ని జగన్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డిలకు కేటాయించారు. నాలుగో సీటు ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానికి కేటాయించారు. ఈ మేరకు సోమవారం అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రలోపు కానీ మంగళవారం కానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Samayam Telugu జగన్


రాజ్యసభ సీట్ల రేసులో వైఎస్సార్‌సీపీ నుంచి చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. మోపిదేవి, పిల్లి సుభాష్, అయోధ్య రామిరెడ్డి పేర్లతో పాటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావుల పేర్లు వినిపంచాయి.. కానీ ఈ నలుగురికి సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోపిదేవి, సుభాష్, నత్వాని పేర్లు ఊహించినవే అయినా.. అయోధ్య రామిరెడ్డి పేరు అనూహ్యంగా సీటు దక్కింది. ఆయన (అయోధ్య రామిరెడ్డి) కూడా రేసులో ఉన్నట్లు కొద్దిరోజులగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తన వెంట కుమారుడు అనంత్, సన్నిహితుడు పరిమళ్ నత్వానీని తీసుకొచ్చారు. అయితే నత్వానికి రాజ్యసభలో అవకాశం కల్పించమని ముఖేష్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని పరిమళ్ కూడా మీడియాతో ప్రస్తావించారు.. నిజమేనని ఒప్పుకున్నారు. ఆయనకు సీటు ఖాయమని ఇటీవలే వార్తలొచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.