యాప్నగరం

ఏపీలో త్వరలోనే ఎన్నికలు.. సీఎం జగన్ పక్కా వ్యూహం: ఎంపీ రఘురామ

ఏపీలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 1 Jan 2023, 8:51 pm
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ సమావేశాల్లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు.
Samayam Telugu రఘురామ కృష్ణరాజు (ఫైల్ ఫొటో)


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన సమయం చూసుకుని ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఎంపీ రఘురామ విశ్లేషించారు. బాగా వర్షాలు కురిసే సమయంలో, కరెంటు కోతలు లేని టైం చూసుకుని ఎన్నికలకు వెళ్తారని తెలిపారు. ఢిల్లీలోనూ దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోందన్నారు. కొత్త అప్పుల కోసం జగన్ ప్రభుత్వం ఎదురు చూస్తోందని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సరిపోయేంత నిధులు కూడా లేవన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర మరో మార్గం లేదన్నారు.

ఇక, జగన్ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ రఘురామ సూచించారు. వైసీపీ నేతలు ఎన్నికలకు వస్తే ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని.. అది ఏమైందని ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి.. ప్రతి విషయంలోనూ మాట తప్పడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను అన్ని విధాలుగా సీఎం జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల పట్ల సీఎం జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.