యాప్నగరం

ఆరోజు బురదలో దిగమంటే నో చెప్పా, అప్పట్లో జగన్ అలా.. ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 23 Oct 2020, 9:25 pm
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం ఎంపీగా ఎన్నికై.. ఆ పార్టీకే గుదిబండగా తయారయ్యారు రఘురామ కృష్ణరాజు. ప్రతి రోజు ‘రచ్చబండ’ కార్యక్రమం నిర్వహిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పలువురు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుంటారు. ప్రభుత్వంలోని తప్పులను ఎత్తిచూపుతూ స్వపక్షంలో విపక్షంగా మెలుగుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన రచ్చబండలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజలతో మమేకమైన జగన్.. సీఎం అయిన తర్వాత ప్రజలకు దూరమయ్యారని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu సీఎం జగన్, రఘురామ


జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉండేవారో ఎంపీ రఘురామ ఓ ఉదాహరణ చెప్పారు. ‘‘2014 ఎన్నికలకు ముందు వైసీపీలో నేను 3 నెలల పాటు కొనసాగాను. నర్సాపురం పరిధిలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో జగన్‌తో కలిసి నేనూ పర్యటించాను. ఓ పొలం వద్దకు వెళ్లగా వెంటనే జగన్ బురదలో దిగారు. నన్ను కూడా రమ్మని కోరారు. అయితే గట్టునే నిలబడి నేను రాలేను.. మీరు వెళ్లి రండని చెప్పా. జగన్ అలాగే బురదలోనే వెళ్లి తడిసిన పంటను చేత్తో తీసుకుని చూశారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత నేనూ రియలైజ్ అయ్యా. జగన్ చేసింది కరెక్టే అని అనుకున్నా.’’ అని రఘురామ వివరించారు.

అలాంటి జగన్మోహన్ రెడ్డి.. పాదయాత్రలో ముసలవ్వల నుంచి చిన్నారుల వరకు ముద్దాడిన వ్యక్తి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు బయటకు రావట్లేదని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ గతాన్ని స్మరించుకోవాలని సూచించారు. గతంలో మీరు చేసిన పనులను, ఇప్పుడు చేస్తున్న పనులను విశ్లేషించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉండాలని జగన్‌కు ఎంపీ రఘురామ సూచించారు.

Also Read: రైతులకు శుభవార్త.. ఈ నెల అకౌంట్లలో రూ. 4,000 జమ.. బ్యాంకర్లతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Must Read: ఉద్యోగులకు సీఎం జగన్ దసరా బొనాంజా.. ఆ డబ్బులన్నీ ఇచ్చేందుకు అంగీకారం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.