యాప్నగరం

కడపలో రెండు వర్గాల వార్.. కత్తులు, గడ్డపారలతో దాడులు.. జనాలు బెంబేలు

కడప జిల్లా కమలాపురంలో అధికార వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

Samayam Telugu 19 Sep 2020, 8:51 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం కడప జిల్లా కమలాపురంలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ నాయకులు పరస్పరం కత్తులు, గడ్డపారలతో దాడులకు తెగబడి స్థానికులను బెంబేలెత్తించారు. పోలీసులు రంగంలోకి దిగి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Samayam Telugu కడపలో దాడులు


కమలాపురం గిడ్డంగి వీధి సీతాలమ్మ గుడి వద్ద శనివారం ఉదయం ఓ వివాదాస్పద స్థలం విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ శ్రేణులు పరస్పరం గొడవకు దిగడంతో వర్గపోరు మొదలైంది. కత్తులు, గడ్డపారలతో ఇరు వర్గాలు మధ్య పరస్పర దాడులకు తెగబడ్డాయి. ఈ దాడిలో రెండు గ్రూపులకు సంబంధించిన కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడితో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కాసేపు రెండు వర్గాలు భీకర స్థాయిలో పరస్పరం దాడులకు తెగబడ్డారు.

భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు రంగంలోకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత కూడా రెండు వర్గాలు పరస్పరం దాడులను కొనసాగించాయి. పోలీసులు అతికష్టం మీద రెండు వర్గాలను తరిమి కొట్టడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.