యాప్నగరం

సొంత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బైరెడ్డి

పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలి.. కార్యకర్తలకు న్యాయం చేస్తే పదవులు, అధికారం అవసరంలేదు. మంత్రి అనిల్‌కుమార్‌ను విమర్శించిన వారెవరూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కాదన్న బైరెడ్డి.

Samayam Telugu 3 Mar 2020, 7:08 am
వైఎస్సార్‌సీపీ యువ నేత, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాజా పరిణామాలపై స్పందించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలని.. కార్యకర్తలకు న్యాయం చేస్తే పదవులు, అధికారం అవసరంలేదన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బాధపెట్టారని గుర్తు చేశారు.
Samayam Telugu sidhu


మంత్రి అనిల్‌కుమార్‌ను విమర్శించిన వారెవరూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కాదన్నారు బైరెడ్డి. వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వారైతే.. తాను సమాధానం కచ్చితంగా చెబుతాను అన్నారు. సోషల్‌ మీడియాలో ఎంత క్రేజ్‌ ఉన్నా.. అది రాజకీయాల్లో పనికి రాదని అభిప్రాయపడ్డారు. ప్రజా సేవ చేస్తేనే.. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుందన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తానన్నారు.

గత కొద్దిరోజులుగా నందికొట్కూరు నియోజకవర్గం రాజకీయం ఆసక్తికరగా మారింది. ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పదవి విషయంలో రెండు గ్రూపులు పోటీపడ్డాయి. మంత్రి అనిల్ బైరెడ్డికి అనుకూలంగా ఉన్నారని.. ఎమ్మెల్యే వర్గం అసహనంతో ఉంది. మంత్రి తమ జిల్లాలో రాజకీయం చేయొద్దని.. ఏదైనా ఉంటే ఆయన సొంత జిల్లాలో చేసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన్ను తిరగనీయమంటూ విరుచుకుపడ్డారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా చెప్పారు.. ఇద్దర్ని కూర్చోబెట్టి మాట్లాడే బాధ్యతను తనకు అప్పగించారని.. త్వరలోనే అంతా సర్థుకుంటుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.