యాప్నగరం

ప్రకాశం: అడవిలో 350 ఏళ్లనాటి బావి.. ఆ సాములోరు చెప్తే కట్టారంట, చూస్తే ఔరా అనాల్సిందే

Mylacherla 350 Years Old Step Well కనిపించింది. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఈ బావి ఉంది. అది బావి మాత్రమే కాదు.. ఓ ఇంజనీరింగ్‌ అద్భుతం అంటారు ఆ చుట్టు పక్కల జనాలు. ఒంగోలు నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఈ బావి అటవీ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం చూడటానికి ఈ బావిలో నీరు కొద్దిగా మురికిగా ఉన్నా.. తీయదనాన్ని కోల్పోకపోవడం విశేషం అని చర్చించుకుంటున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Dec 2022, 5:37 am

ప్రధానాంశాలు:

  • ప్రకాశం జిల్లాలో పురాతన బావి
  • ఈ బావి ఒక ఇంజినీరింగ్ అద్భుతం
  • నీళ్లు మురికిగా ఉన్నా తియ్యగానే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 500 Years Old Step Well
నల్లమల అడవిలోని 350 ఏళ్లనాటి ఓ దిగుడుబావి.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అది కూడా మాములు బావి కాదు. ఎవ్వరైనా ఆ బావి కట్టిన వారి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే. అలా ఉంటుంది ఆ బావి నిర్మాణం. ప్రకాశం జిల్లా మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉంది ఈ దిగుడు బావి.

లేత గోధుమ వర్ణ గ్రానైట్‌తో ఈ బావిని నిర్మించారు. ఈ బావి నిర్మాణం నాటి భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ బావి నిర్మాణమే కాదండోయ్.. దీని చరిత్ర కూడా చాలా గొప్పది. భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు దీనిని నిర్మించాలని సూచించినట్లు చెప్తారు అక్కడి స్థానికులు. ఆ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలను చూసి.. మైలచర్ల నీటి ఊట దగ్గర ఒక దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన గండి సోదరులను ఆదేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సాములోరి ఆదేశంతోనే గండి సోదరులు అప్పట్లో దీనిని నిర్మించారని అక్కడి ప్రజల నమ్మకం.
ఎంత భారీ వర్షం వచ్చినా కూడా మట్టి, బురదనీరు ఈ బావిలోకి చేరకుండా దీనిని డిజైన్ చేశారు. ఈ భావిలోని నీరు తియ్యగా ఉంటుందని..ఎంత దుర్బిక్షం ఏర్పడ్ద కూడా.. బావి లో నీరు మాత్రం తగ్గదని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ నీరు తాగిన వారికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని స్థానికుల నమ్మకం. సరైన రోడ్డు మార్గం లేక ఈ దిగుడు బావి విలువ బయటి ప్రపంచానికి తెలియట్లేదని చెప్తున్నారు ఇక్కడి జనం.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.