యాప్నగరం

సింగరాయకొండలో లారీ బోల్తా.. బీరు సీసాల కోసం ఎగబడ్డ జనం.. దొరికినోడికి దొరికినంత!

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బీరు బాటిళ్ల లారీ బోల్తా పడింది. దీంతో బీరు బాటిళ్ల కోసం ప్రజలు ఎగబడ్డారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 22 May 2022, 2:34 pm
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో బీరు బాటిళ్ల లారీ బోల్తా పడింది. మండలంలోని కలికివాయి సమీపంలో జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో బీరు బాటిళ్లు ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో స్థానికులు ఆ లారీ పరిస్థితి, అందులో ఉన్న వ్యక్తుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు.
Samayam Telugu బీరు బాటిళ్లు ఎత్తుకెళ్తున్న స్థానికులు



రోడ్డుపై పడ్డ బీరు బాటిల్స్‌ దొరికినోడికి దొరికినన్ని ఎత్తుకెళ్లారు. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో బీరు బాటిళ్లను దోచేశారు. శ్రీకాకుళం నుంచి మదనపల్లికి బీరు లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.